Fri Dec 05 2025 11:57:21 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్న భాషా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో...
భాషా తన ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా తాడిపత్రిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

