Sun Mar 15 2026 15:23:13 GMT+0530 (India Standard Time)
1.10 కోట్ల హవాలా నగదు స్వాధీనం
హైదరాబాద్ నగరంలో కోటి పది లక్షల రూపాయల నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

హైదరాబాద్ నగరంలో కోటి పది లక్షల రూపాయల నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో అందిన సమాచారం మేరకు దాడి చేసి మరీ ఈ నగదును స్వాదీనం చేసుకుంది. దీనిని హవాలా సొమ్ముగా టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు అదుపులో...
అదుపులోకి తీసుకున్న నలుగురి నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై విచారణ చేస్తున్నారు. పెద్దమొత్తంలో నగదును హవాలా రూపంలో పంపుతున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ దాడులు చేసి పట్టుకున్నారు.
Next Story

