Sat Sep 07 2024 10:19:11 GMT+0000 (Coordinated Universal Time)
Armstrong: పోలీసుల ఎన్కౌంటర్లో రౌడీ షీటర్ తిరువేంగడం హతం
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారు అసలు నిందితులు కాదంటూ
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితులలో ఒకరు శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ హత్యకేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ తిరువేంగడం చెన్నైలోని మాధవరం సమీపంలో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైనట్లు తెలిపారు. తిరువేంగడం హత్యకు ముందు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చాలా రోజుల పాటు అనుసరించాడు.. BSP నాయకుడి కార్యకలాపాలపై నిఘా ఉంచారు.
జూలై 5న కె ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని అతని నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. బైక్‌పై వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు, అతన్ని రోడ్డుపై తీవ్రంగా గాయపరిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేశాయి. ఇంతలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారు అసలు నిందితులు కాదంటూ సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం చేస్తామని ఆర్మ్‌స్ట్రాంగ్ భార్యకు హామీ ఇచ్చారు.
Next Story