Wed Sep 18 2024 23:47:00 GMT+0000 (Coordinated Universal Time)
పనిమనిషి అనుమానాస్పద మృతి.. హత్యా? ప్రమాదమా ?
ఎప్పటి లాగానే శుక్రవారం షేక్ పేట్ లక్ష్మినగర్ లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పనిచేసేందుకు వచ్చిన వీణ.. మూడో
పనిమనిషి లిఫ్ట్ లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. షేక్ పేట్ లక్ష్మి నగర లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్ కు చెందిన వీణ తన భర్త, పిల్లలతో కలిసి నగరంలోని కార్వాన్ లో ఉంటోంది. భర్త వృత్తిరీత్యా టైలర్ కాగా.. వీణ ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఎప్పటి లాగానే శుక్రవారం షేక్ పేట్ లక్ష్మినగర్ లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పనిచేసేందుకు వచ్చిన వీణ.. మూడో అంతస్తులో లిఫ్ట్ లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అపార్ట్ మెంట్ వాసుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీణ లిఫ్ట్ లో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీణ ప్రమాద రీత్యా చనిపోయిందా ? లేక ఎవరైనా హతమార్చి అక్కడ ఉంచారా ? అన్న విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story