Fri Sep 13 2024 02:14:00 GMT+0000 (Coordinated Universal Time)
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. గ్యాంగ్ రేప్ ఆరోపణలు
వివరాల్లోకి వెళ్తే.. గోరంట్లకు చెందిన యువతి.. తిరుపతిలో బీ ఫార్మసీ చదువుతోంది. ఇటీవల సాధిక్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం
గోరంట్ల : ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవర విజయవాడ, గుంటూరు, రేపల్లె లలో మహిళలపై జరిగిన దారుణ ఘటనలపై ఇంకా దర్యాప్తు జరుగుతుండగానే.. మరో ఘటన వెలుగులోకొచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కూతురి మృతితో.. తల్లడిల్లిన ఆ తల్లి, శరీరంపై ఉన్న గాట్లు చూసి.. రేప్ జరిగిందని ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గోరంట్లకు చెందిన యువతి.. తిరుపతిలో బీ ఫార్మసీ చదువుతోంది. ఇటీవల సాధిక్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగగా.. వీరి విషయం యువతి ఇంట్లో తెలియడంతో.. ఇల్లు ఖాళీ చేసి మరో వీధికి మకాం మార్చారు. కొన్నాళ్లుగా సాధిక్ కు దూరంగా ఉంటున్న యువతి.. అనుమానాస్పద స్థితిలో మల్లాపల్లిలోని సాధిక్ ఫామ్ హౌస్ లో విగతజీవిగా కనిపించింది. కూతురి మృతిపై తల్లి నాగమణి అనుమానం వ్యక్తం చేశారు.
తన కూతురికి సాధిక్ మాయమాటలు చెప్పి..రేప్ చేసి, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తిరుపతిలో ఉన్న తన కూతుర్ని కారులో మల్లాపల్లికి తీసుకొచ్చి, రూమ్ లో బంధించి, ముగ్గురు, నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారని, తన ఒంటిపై ఉన్న గాట్లు చూస్తే గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తుందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రేప్ కేసు నమోదు చేయడం లేదని వాపోయారు. తన కూతురి చావు వెనుక చాలా మంది ఉన్నారని, పోలీసులు ఆ విషయం బయటికి రాకుండా నిందితులకు కొమ్ముకాస్తున్నారని బాధిత యువతి తల్లి ఆరోపిస్తున్నారు.
Next Story