Fri Dec 05 2025 17:27:28 GMT+0000 (Coordinated Universal Time)
Murder Cases : హత్యల వెనక నెల్లూరోళ్లేనట... వామ్మో వీళ్లు సుపారీ తీసుకుంటే చాలు...?
రెండు తెలుగు రాష్ట్రాల్లో హత్యలు చేయడానికి సుపారీ గ్యాంగ్ సింహపురిలోనే దొరుకుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హత్యలు చేయడానికి సుపారీ గ్యాంగ్ సింహపురిలోనే దొరుకుతున్నారు. నెల్లూరులో పేరు మోసిన పాత నేరస్థులు కొందరు జిల్లాలను దాటి హత్యలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ హత్య జరిగినా పోలీసులు తొలి చూపు నెల్లూరుపైనే పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ జరిగిన రెండు హత్యలు, కిడ్నాప్ లలో నెల్లూరు రౌడీల పాత్ర ఉండటంతో అక్కడి పోలీసు యంత్రాంగం కూడా అలెర్ట్ అయింది. పాత రికార్డులను చూసి ఓల్డ్ క్రిమినల్స్ పై ఒక కన్నేసి ఉంచాలని ఉన్నతస్థాయి పోలీసు అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నెల్లూరులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై నిఘా మరింత ముమ్మరం చేసినట్లు తెలిసింది.
వీరయ్య చౌదరి మర్డర్ కేసులోనూ...
ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా నెల్లూరుకు చెందిన పాత నేరగాళ్లకు సుపారీ చెల్లించి స్కెచ్ వేసి చంపేశారు. రెండు నెలల క్రితం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించి, అయితే సుపారీ గ్యాంగ్ కు మాత్రం వినోద్ ఇప్పటి వరకూ రెండు లక్షలు మాత్రమే చెల్లించారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోటు పోటుకు ఇంత మొత్తం చెల్లిస్తామని చెప్పడంతోనే వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేశారని తర్వాత సుపారీ గ్యాంగ్ కు రెండులక్షలు తీసుకుని పరారయ్యారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారంతా పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా తేలింది. వీరయ్య చౌదరి ఫొటో తీసుకుని లాడ్జిలో కొన్ని రోజులు ఉండి ఆయన రాకపోకలు గమనించి మరీ దారుణంగా చంపేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.
మలక్ పేట్ లో జరిగిన హత్య కేసులో...
తాజాగా తెలంగాణలోని మలక్ పేట్ లో జరిగిన చందు రాధోడ్ హత్య కేసులోనూ నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్ ప్రమేయం ఉందని పోలీసులు విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. మలక్ పేట్ లోని శాలివాహన నగర్ లోని పార్కులో వాకింగ్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. చందూరాథోడ్ అక్కడిక్కడే మరణించారు. మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. చందు రాధోడ్ కదలికలను రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. కారును అద్దెకు తీసుకుని చందు రాధోడ్ నివాసం వద్ద రెండు రోజుల పాటు మకాం వేశారు. చందు రాధోడ్ రోజు వారీ కార్యక్రమాలను గురించి పక్కాగా తెలుసుకున్నారు. పక్కాగా హత్య చేసి వెళ్లిపోయారు. ప్లాన్ వేసినట్లుగానే అమలు చేయడంలో సక్సెస్ కావడంతో సుపారీ ఇచ్చే వారు కూడా నెల్లూరుకు చెందిన పాతనేరగాళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో నెల్లూరు పోలీసులు పాత రౌడీషీటర్లపై నిఘాపెంచారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రౌడీషీటర్లు కత్తులు, కాల్పులతో గడగడలాడిస్తున్నారు. మరి పోలీసులు వీరిని కట్టడి చేయాలని కోరుతున్నారు.
Next Story

