Wed Mar 25 2026 01:11:40 GMT+0530 (India Standard Time)
క్లాస్‌రూంలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
హైదరాబాద్ లోని నార్సింగిలో ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీ చైతన్య కళాశాలలో ఈ ఘటన జరిగింది

హైదరాబాద్ లోని నార్సింగిలో ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీ చైతన్య కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన విద్యార్థులు సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. యాజమాన్యం ముందుకు రాకపోవడంతో ఒక మోటారు సైకిల్ మీద సాత్విక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు.
తల్లిదండ్రుల ఆందోళన...
దీంతో తల్లిదండ్రులు శ్రీచైతన్య కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతికి కళశాల యాజమాన్యం వేధింపులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. సాత్విక్ ను వత్తిడికి గురి చేయడం, కొట్టడం వంటి కారణాలవల్లనే చనిపోయాడని స్నేహితులు చెబుతున్నారు. ఈ ఘటనతో శ్రీ చైతన్య స్కూలు హాస్టల్ నుంచి విద్యార్థులకు సెలవులు ఇచ్చి పంపేశారు. విద్యార్థి సంఘాలు కూడా క్యాంపస్ వద్దకు చేరుకుని సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాయి.
Next Story

