Fri Sep 13 2024 01:31:45 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం : పాముకాటు ఘటనలో ఓ విద్యార్థి మృతి
విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి..
విశాఖపట్నం : విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మంతిని రంజిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాము కాటుకు గురైన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇంకో విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రంజిత్ మృతితో.. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నారుగా విలపిస్తున్నారు.
కురుపాంలోని వెనుకబడిన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో విషపు పాము ముగ్గురు విద్యార్థులను కాటేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న రంజిత్, వంశీ, వంగపండు నవీన్ లు పాము కాటుకు గురవ్వగా.. కాటేసిన కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వసతిగృహం సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు.
News Summary - Student Died Who is Bitten by Snake in Kurupam Residential School
Next Story