Sat Mar 07 2026 17:34:49 GMT+0530 (India Standard Time)
Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి రామటి ప్రవీణ్ కుమార్ మరణించాడు

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామటి ప్రవీణ్ కుమార్ మరణించాడు. బాలుర వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వసతి గృహంలోని నాలుగో అంతస్థులో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్ కు సమాచారం తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రవీణ్ కుమార్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కారణాలపై...
ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా. అయితే చదువుల వత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న సహచర విద్యార్థులు షాక్ కు గురయ్యారు.
Next Story

