Thu Sep 19 2024 00:55:09 GMT+0000 (Coordinated Universal Time)
పాయకాపురంలో కలకలం.. సంతోషిమాత ఆలయంలో విగ్రహం చోరీ
తాజాగా మరోసారి విజయవాడలోని పాయకాపురంలో అలాంటి ఘటనే జరగ్గా.. స్థానికంగా కలకలం రేపింది. పాయకాపురంలోని సంతోషిమాత ..
విజయవాడ : ఏపీలో గతంలో వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, చోరీ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటనలు కలకలం రేపాయి. తాజాగా మరోసారి విజయవాడలోని పాయకాపురంలో అలాంటి ఘటనే జరగ్గా.. స్థానికంగా కలకలం రేపింది. పాయకాపురంలోని సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగింది.
పునఃనిర్మాణంలో ఉన్న సంతోషిమాత ఆలయంలోని ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం అపహరణకు గురైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story