Thu Dec 18 2025 18:00:22 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుప్రమాదంలో యువకుడి ప్రాణాలను కాపాడిన సోనూసూద్
సోనూసూద్ ప్రయాణిస్తోన్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన స్థలంలో కారులో ఓ యువకుడు అపస్మా

కరోనా (లాక్ డౌన్) సమయంలో ఎంతో మందికి సహాయం చేసి.. రియల్ హీరోగా మారిన సోనూసూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను రక్షించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సోనూసూద్ ప్రయాణిస్తోన్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన స్థలంలో కారులో ఓ యువకుడు అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోనూ గమనించారు.
వెంటనే అతడిని బయటికి తీసి, దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో యువకుడి ప్రాణాలను కాపాడగలిగినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కారుకు సెంట్రల్ లాక్ ఉండడంతో బాధితుడిని కారు నుండి బయటకు తీసుకురావడానికి కొంత సమయం పట్టినట్టు తెలుస్తోంది. మరోసారి కారుకు సెంట్రల్ లాక్ ఉండడంతో బాధితుడిని కారు నుండి బయటకు తీసుకురావడానికి కొంత సమయం పట్టినట్టు సమాచారం.
Next Story

