Mon Sep 09 2024 12:52:47 GMT+0000 (Coordinated Universal Time)
సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ
విలువైన నగలు, నగదు లేకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో రూ.1.41 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు మాయం
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ నివాసంలో భారీ చోరీ జరిగింది. సోనమ్ కపూర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో తన తల్లివద్ద ఉంటోంది. ఇటీవల ఢిల్లీలో ఉన్న తన నివాసానికి వెళ్లిన సోనమ్.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. విలువైన నగలు, నగదు లేకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో రూ.1.41 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు మాయం అయినట్లు సోనమ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ చోరీ ఫిబ్రవరి 23న జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోనమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్, తోటమాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ నివాసంలో సోనమ్ భర్త ఆనంద్ ఆహూజా తల్లిదండ్రులతో పాటు అతడి బామ్మ కూడా ఉంటున్నారు.
Next Story