Sat Sep 14 2024 10:47:28 GMT+0000 (Coordinated Universal Time)
జల్సాలు చేస్తున్నాడని.. తండ్రిని హతమార్చిన కొడుకు
లక్ష్మయ్యకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అవ్వగా.. ముగ్గురు భార్యలు అతని
వ్యసనాలకు బానిసై.. జల్సాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్న తండ్రిని కొడుకు హతమార్చాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్ పల్లిలో నివసించే చాకలి లక్ష్మయ్య (60) వ్యసనాలకు బానిసయ్యాడు. వాటికి తోడు.. తన జల్సాలకు ఇష్టమొచ్చినంత డబ్బును ఖర్చుపెట్టేవాడు.
Also Read : మెగా భోగి సంబరాలు.. వరుణ్ తో "చిరు" అల్లరి
లక్ష్మయ్యకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అవ్వగా.. ముగ్గురు భార్యలు అతనిప్రవర్తన, వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నారు. వ్యసనాలకు బానిసై.. మానలేని లక్ష్మయ్య ఇటీవల తన కొడుకు కిష్టయ్యను మద్యానికి డబ్బులు కావాలని అడిగాడు. దాంతో విసుగుచెందిన కిష్టయ్య తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కిష్టయ్యను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story