Thu Jan 22 2026 03:19:50 GMT+0000 (Coordinated Universal Time)
అల్లుడి ప్రాణం తీసిన అక్రమ సంబంధం
జాతరలో పాల్గొన్న సూర్యప్రకాశ్ (23) అనే వ్యక్తిని అతని మామ లింగమయ్య కత్తితో నరికి చంపాడు. అంత భారీ బందోబస్తులోనూ..

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. వావి వరసలు లేకుండా కొందరు గుట్టుగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటే.. మరికొందరు భార్య ఉండగానే మరో మహిళతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా అవి వారి ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దేవనకొండ మండలం పి.కోటకొండలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో జాతర జరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో పాల్గొన్న సూర్యప్రకాశ్ (23) అనే వ్యక్తిని అతని మామ లింగమయ్య కత్తితో నరికి చంపాడు. అంత భారీ బందోబస్తులోనూ ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. వారి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, అందుకే లింగమయ్య సూర్యప్రకాశ్ ను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సూర్యప్రకాశ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందువల్లే లింగమయ్య అతనిపై పగ పెంచుకున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

