Fri Dec 05 2025 14:16:29 GMT+0000 (Coordinated Universal Time)
పేగు బంధాన్ని మరిచిపోయి.. తల్లిపై కుమారుడి కర్కశత్వం !
తానెన్ని కష్టాలు పడిన కొడుకు సుఖంగా ఉండాలని కలలుకంది. కొడుక్కి పెళ్లి చేసి, బాధ్యత తీరిపోయింది, తన కష్టాలు కూడా తీరిపోయా

ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులూ.. కొడుకు కోసమే కష్టపడింది ఆ కన్నతల్లి. తానెన్ని కష్టాలు పడిన కొడుకు సుఖంగా ఉండాలని కలలుకంది. కొడుక్కి పెళ్లి చేసి, బాధ్యత తీరిపోయింది, తన కష్టాలు కూడా తీరిపోయాయి అనుకుంది. కానీ.. పెళ్లైన కొడుకు రూపంలో అవి మరింత ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో తల్లికి ఆసరాగా ఉండాల్సిన కొడుకే.. ఆమెపాలిట శత్రువులా మారాడు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న కన్నతల్లిపై కర్కశత్వం ప్రదర్శించాడు. ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి, అనంతరం ఇంటి నుంచి గెంటేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురంలో జరిగిందీ ఘటన. వృద్ధురాలైన తల్లిపై కొడుకు శేషు విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా.. ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు శేషు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనా దృశ్యాలను స్థానికులు వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు.. కొడుకు శేషును అదుపులోకి తీసుకున్నారు.
Next Story

