Mon Mar 16 2026 01:46:45 GMT+0530 (India Standard Time)
ట్రక్కులో 46 మృతదేహాలు.. కలకలం
మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రక్కులో భారీ సంఖ్యలో మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది

మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రక్కులో భారీ సంఖ్యలో మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. మెక్సికో సరిహద్దును దాటుతున్న ఓ ట్రక్కులో 46 మృతదేహాలను అధికారులను అధికారులు గుర్తించారు. అయితే ఈ ట్రక్కులో 16 మంది సజీవంగా ఉండటం విశేషం. వీరిని అధికారులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వలస వెళ్లేందుకు?
మెక్సికోలోని శాన్ ఆంటోనియోలో ఒక ట్రక్కులో 46 మృతదేహాలు లభ్యమయ్యాయి. అమెరికాలోని దక్షిణ టెక్సాస్ కు వీరంతా వలస వెళ్లేందుకు ప్రయత్నించగా చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కు ఈ ట్రక్కు మెక్సికో సరిహద్దును దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డగించారు. మృతదేహాలు ఎక్కడివి? ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Next Story

