Sat Dec 06 2025 14:31:03 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేతపై కాల్పులు
పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు కాల్పులు జరిపారు

పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వచ్చి మరీ కాల్పులు జరిపారు. తలుపులు కొట్టి పిలవగా బాలకోటిరెడ్డి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన బాలకోటిరెడ్డిపై వెంటనే కాల్పులు జరిపారు. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది.
పరిస్థితి విషమం...
బాలకోటిరెడ్డి పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ గురి తప్పింది. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే పరారయ్యారు. గాయపడిన వెంకటకోటిరెడ్డిని వెంటనే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
Next Story

