పుష్ప సినిమాను తలపించే స్మగ్లింగ్.. క్యాబిన్లో రహస్య అర
హైదరాబాద్‌కు చెందిన కర్రే శ్రీశైలంకు లారీ ఉంది.

హైదరాబాద్‌కు చెందిన కర్రే శ్రీశైలంకు లారీ ఉంది. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతానికి వెళ్లి గంజాయి తీసుకువస్తే బాగా డబ్బులిస్తామని హైదరాబాద్‌కు చెందిన నర్సిరెడ్డి, యాదయ్య అనే ఇద్దరు అతడితో డీల్ కుదుర్చుకున్నారు. ఒడిశాకు వెళ్లి లారీ క్యాబిన్లో తన సీటు వెనుక అరలో గంజాయి బస్తాలను నింపేశాడు. మే 24న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్తూ గోల్డెన్‌ఫిష్ దాబా దగ్గర హైవేపై మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టాడు.
హైదరాబాద్‌కు చెందిన కర్రే శ్రీశైలంకు లారీ ఉంది.బైక్‌పై ఉన్న ఇద్దరు మరణించడంతో భయపడి లారీతో సహా పరారయ్యాడు. కొవ్వూరు-నల్లజర్ల జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన యర్నగూడెం శివారులోని ఓ ఇటుక బట్టీ వద్ద లారీని ఉంచాడు. మే 28న పోలీసులకు ఈ లారీ గురించి సమాచారం అందింది. లారీ క్యాబిన్లో సీటు వెనుక ప్రత్యేక అరలో 22లక్షల రూపాయల విలువైన 730కిలోల 18 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

