Sat Mar 07 2026 17:41:48 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగన్నాథపురం జాతీయ రహదారిపై

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగన్నాథపురం జాతీయ రహదారిపై ఆగివున్న లారీని క్వాలిస్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిచ్కుంద నుంచి పిట్లంవైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కారు వేగమే ప్రమాదానికి కారణం
కాగా.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లు గుర్తించారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు. కారు అతివేగంగా రావడంవల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆగివున్న లారీని కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ముందుభాగం నుజ్జునుజ్జయింది.
Next Story

