Wed Jan 21 2026 03:09:08 GMT+0000 (Coordinated Universal Time)
గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురు దుర్మరణం
పానిపట్ లోని తహసీల్ క్యాంప్ లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఓ ఇంటిలో గురువారం తెల్లవారుజామున..

హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. పానిపట్ లోని తహసీల్ క్యాంప్ లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఓ ఇంటిలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దంపతులు సహా.. నలుగురు పిల్లలు.. మొత్తం ఆరుగురు దుర్మరరణం చెందారు. సిలిండర్ పేలడంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి.
ఇంట్లో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో.. ఆరుగురూ గుర్తుపట్టలేని రీతిలో దహనమయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు అబ్దుల్ కరీం (50), అతని భార్య ఆప్రోజా (46), పెద్ద కుమార్తె ఇష్రత్ ఖాతున్ (17), రేష్మా (16), అబ్దుల్ షకూర్ (10), అఫాన్ (7)లుగా గుర్తించారు.
Next Story

