Tue Mar 17 2026 09:39:15 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది.

హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. రహదారి పక్కనే ఆగి ఉన్న వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యానాలోని రేవారి సమీపంలోని మసాని గ్రామం వద్ద వాహనం టైరు పంక్చర్ కావడంతో టైరును మారుస్తున్నారు. అయితే ఇది గమనించని కారు డ్రైవర్ వేగంగా వచ్చి ఆగి ఉన్న వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టారు.
వేగంగా వచ్చి...
ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఆరుగురిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని బంధువులకు చేరవేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

