Thu Mar 19 2026 09:08:20 GMT+0530 (India Standard Time)
అనంతపురంలో విషాదం.. కరెంట్ షాక్ తో ఆరుగురు కూలీలు మృతి
ట్రాక్టర్లో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా.. విద్యుత్ మెయిన్ లైన్ తీగ తెగిపడి ఆరుగురు కూలీలు మృతి..

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని బొమ్మనహల్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్లో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా.. విద్యుత్ మెయిన్ లైన్ తీగ తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
విద్యుత్ అధికారులకు సమాచారం అందించి సరఫరా నిలిపివేయించారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఏడాది జూన్ 30న తాడిమర్రి మండలంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండగా.. ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు.
Next Story

