Tue Sep 10 2024 12:00:41 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసు కస్టడీకి శిల్పా చౌదరి
శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శిల్పా చౌదరిని రెండురోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.
శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శిల్పా చౌదరిని రెండురోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. న్యాయస్థానం రెండు రోజుల పాట కస్టడీకి మాత్రమే అనుమతించింది. శిల్పా చౌదరి ప్రముఖల నంచి వంద కోట్ల రూపాయలను వసూలు చేసి చేతులెత్తేసింది. దాదాపు పది కేసులు శిల్పా చౌదరిపై నమోదయ్యాయి.
వంద కోట్ల....
కిట్టీ పార్టీలు, వీకెండ్ పార్టీల ద్వారా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలతో శిల్పా చౌదరి పరిచయం పెంచుకున్నారు. ముఖ్యంగా మహిళలను మాటలతో మాయ చేసి ఒక్కొక్కరి నుంచి కోటి నుంచి ఐదు కోట్ల వరకూ తీసుకున్నారు. బ్లాక్ ను వైట్ మనీగా మారుస్తామని చెప్పడం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసమని ఇలా నమ్మించి తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శిల్పా చౌదరి భర్త కు నిన్న బెయిల్ లభించింది.
Next Story