Fri Dec 05 2025 19:10:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పంజాబ్ లో కాల్పులు..నలుగురు మృతి
పంజాబ్ లోని భటిండా మిలటరీ స్టేషన్ లో కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు

పంజాబ్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. భటిండా మిలటరీ స్టేషన్ లో కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈరోజు తెల్లవారు జామున భటిండా మిలటరీ స్టేషన్ లో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటనకు కారణం ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నలుగురు మృతి...
ఈ కాల్పుల్లో నలుగురు మరణించడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మిలటరీ స్టేషన్ పై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు అంత తెగబడ్డారు? వారి వెనకఉన్న శక్తులు ఎవరు అన్నదానిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారి వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది.
Next Story

