Mon Mar 16 2026 02:04:23 GMT+0530 (India Standard Time)
పూణేలో రియల్టర్ పై కాల్పులు.. రెస్టారెంట్లో ఉండగా
మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ పై కాల్పులు కలకలం రేపాయి. ఒక రెస్టారెంట్ లో ఉండగా ప్రత్యర్థులు కాల్పులు జరిపారు

మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ పై కాల్పులు కలకలం రేపాయి. ఒక రెస్టారెంట్ లో ఉండగా ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈ కాల్పులు జరిగాయని పోలీసులు ప్రాధమికంగా నిర్ణారించారు. కాల్పులకు తెగబడటానికి కారణం స్థల వివాదం కూడా ఒక కారణమని పోలీసులు చెబుతున్నారు.
రెస్టారెంట్లో ఉండగా...
పూణేలోని రియల్టర్ అవినాష్ ఒక రెస్టారెంట్లో తన స్నేహితులతో కూర్చుని ఉండగా అక్కడకు వచ్చిన దుండగుడు నేరుగా అతనిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల శబ్దం విని రెస్టారెంట్లోని ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. కాల్పుల్లో గాయపడిన అవినాష్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

