Thu Mar 12 2026 16:17:30 GMT+0530 (India Standard Time)
పెళ్లి మండపంలో వధువుపై కాల్పులు
బీహార్ లో పెళ్లి జరుగుతున్న సమయంలో షాకింగ్ ఘటన జరిగింది

బీహార్ లో పెళ్లి జరుగుతున్న సమయంలో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి జరుగుతుండగానే పెళ్ళి పీటలపై ఉన్న పెళ్లి కూతురుని తుపాకీతో దుండగుడు కాల్చాడు. వధూవరులకు హారతి పడుతున్న సమయంలో హారతి పట్టే యువతి వెనుక కి వచ్చి పెళ్ళికూతురు గుండెకు గురిపెట్టి కాల్చడంతో వధువుకు తీవ్ర గాయాలయ్యాయి.
గుండెకు గురిపెట్టి...
రెప్పపాటులో ఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. షాక్ నుంచి తేరుకుని రక్తపు మడుగులో ఉన్న వధువును సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరించారు. బీహార్ లో నీ బక్సర్ చౌహా బజార్ లో ఈ ఘటన జరిగింది. ఒక్క సారి కాల్పులు మోత రావడంతో పెళ్ళికొడుకు కుటుంబసభ్యులు బంధువులు షాక్ కు గురయ్యారు. పెళ్ళి మండపంలో తీవ్ర విషాదం నింపింది. ప్రస్తుతం పెళ్ళికూతురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆగంతకుడు ఎవరన్నది సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story

