Thu Sep 19 2024 00:57:57 GMT+0000 (Coordinated Universal Time)
సినీనటిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్
కత్తి చూపించి, చంపేస్తామని బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. లైంగిక దాడి సమయంలో వీడియో తీసి..
చెన్నై : అర్థరాత్రి సినీనటిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని వలసరవాక్కుంకు చెందిన ఓ సినీ సహాయ నటి భర్త నుంచి విడిపోయి చాలా కాలమైంది. ఒంటరిగా ఏకేఆర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. మార్చి 8 మంగళవారం అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు తన ఇంటిలోకి చొరబడి కత్తి చూపించి దొంగతనానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. తన వద్దనున్న 10 గ్రాముల బంగారం, రూ.50 వేలు దోచుకెళ్లారు.
కత్తి చూపించి, చంపేస్తామని బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. లైంగిక దాడి సమయంలో వీడియో తీసి.. తమ గురించి ఎవరికైనా చెప్తే వీడియో లీక్ చేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది. సన్నిహితుల చొరవతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏకేఆర్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు చెన్నై రామాపురం ప్రాంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ లుగా గుర్తించారు.
Next Story