Tue Jul 08 2025 17:09:51 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మరణించారు

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మరణించారు. ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ బల్కంపేట్ లోని ఆలయం బందోబస్తుకు వచ్చారు. బందోబస్తు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా రాజేష్ గౌడ్ ప్రయాణిస్తున్న కారును లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై రాజేష్ గౌడ్ అక్కడికక్కడే మరణించారు.
వెనక నుంచి వచ్చిన కారు...
ఆయన స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని కావడంతో అక్కడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. అతి వేగంగా వచ్చిన లారీ డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ఱారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story