Thu Mar 19 2026 22:06:47 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ యువకుడు మార్గ మధ్యంలోనే మరణించడంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
అతి వేగమే...
నిన్న అర్ధరాత్రి ఒంటిగంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మహేశ్వరం పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కారును డీఎఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులందరూ నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన వారు. కేశవులు, యాదయ్య, రామస్వామిలుగా గుర్తించారు.
Next Story

