Thu Dec 18 2025 23:01:47 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. పంజాబ్ లోని బాటలలో ఈ ప్రమాదం జరిగింది. కారు - ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడంతో ఐదుగురు మరణించారు.
పంజాబ్ లో...
గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

