Sun Mar 15 2026 10:20:00 GMT+0530 (India Standard Time)
గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటో బోల్తాపడి ఇద్దరు మరణించగా, 18 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని వీరప్ననేనిగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. గన్నవరం నుంచి వీరపనేని గూడెం వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.
18 మందికి గాయాలు...
ఆటో లో ఉన్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించగా, పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపూడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
Next Story

