Sun Mar 15 2026 11:55:57 GMT+0530 (India Standard Time)
Road Accident : కారులో వస్తుండగా వెనక నుంచి లారీ... ఇద్దరు మృతి
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి వస్తున్న కారును వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ముగ్గురికి గాయాలు...
మృతులు బాపట్ల జిల్లాకు చెందిన కోటపాడుకు చెందిన మార్క్స్, మేరీగా గుర్తించారు. గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్థంభించింది. పోలీసులు వెంటనే వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

