Sat Sep 07 2024 11:24:21 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారని పోలీసులు తెలిపారు
విద్యార్థులు ఇద్దరూ...
మరణించిన వారు ప్రవీణ్ కుమార్, కార్తీక్ లుగా గుర్తించారు. లారీ డ్రైవర్ బైకును ఢీకొన్న వెంటనే వాహనంతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story