Fri Dec 05 2025 14:14:01 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఏపీ డీఎస్పీలు రోడ్డు ప్రమాదంలో స్పాట్ డెడ్
జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్సీలు మరణించారు.

జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్సీలు మరణించారు. తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఇద్దరు డీఎస్పీలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను డీఎస్పీలు శాంతారావు, చక్రధరరావులుగా గుర్తించారు. ఇద్దరు డీఎస్పీలు స్పాట్ లోనే చనిపోయారు.
డివైడర్ ను ఢీకొని...
కారు డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు విధుల నిమిత్తం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది.అటు వైపు వెళుతున్న లారీ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. వీరద్దరూ ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

