Thu Mar 19 2026 16:05:35 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు

హైదారాబాద్ : హైదారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్ నుంచి వచ్చి...
ప్రమాదం జరిగిన చోట ఒకరు మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండటా మరణించారు. మృతులు గోరి సింఘ్, బబ్లీ సింఘ్ గా గుర్తించారు. వీరు వలస కూలీలుగా పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వీరు పనుల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

