Fri Dec 05 2025 09:33:39 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రముఖ నయాగారా జలాపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ కు వస్తున్న ఒక టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. వాహనం అదుపు తప్పడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏ వాహనాన్ని ఢీకొట్టకుండానే ఈ వాహనం ప్రమాదానికి గురయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బస్సులో కూర్చున్న వారిలో...
అయితే బస్సులో కూర్చున్న వారిలో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లనే ప్రమాద తీవ్రత తగ్గిందని, సులువుగా బయటకు వచ్చారని అంటున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం యాభై నాలుగు మంది వరకూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టి, బస్సులో ఇరుక్కుని ఉన్న వారిని బయటకు తీసుకు వచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుున్నారు.
Next Story

