Fri Dec 05 2025 09:05:26 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలోఘోర ప్రమాదం...9 మంది స్పాట్ డెడ్
మహారాష్ట్రలో పూణె లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు.

మహారాష్ట్రలో పూణె లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జేజూరి - మోర్గాన్ రహదారిపై కారు టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు.
నలుగురికి గాయాలు...
గాయపడిన వారిని వెంటనే జేజూరిలోనిశాంతాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరుచిన్నారులున్నారని పోలీసులు తెలిపారు. మృతులను అక్షయ్ రౌత్, అశ్విని సంతోష్, కిరణ్ భరత్ రౌత్, అజిత్ అశోక్ జాదవ్, అక్షయ కుమార్ చవాన్, రాము సంజీవిని యాదవ్, సోమనాథ్ రామచంద్రలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

