Mon Dec 15 2025 07:20:52 GMT+0000 (Coordinated Universal Time)
సర్ణదేవాలయం వద్ద వరుస పేలుళ్లు
పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద వరస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి

పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద వరస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. వరసగా నిన్న రాత్రి, ఈరోజు ఉదయం గోల్డెన్ టెంపుల్కు అతి సమీపంలో ఈ బాంబు పేలుడు జరిగింది. దీంతో స్వర్ణ దేవాలయానికి వచ్చిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు అనేక మంది భక్తులు సిద్ధమవ్వడంతో సర్ణదేవాలయం సిబ్బంది వారిని వారించారని తెలిసింది.
పేలుడు కారణంగా...
అయితే ఈ పేలుడు కారణంగా ఎవరూ మరణించలేదని అధికారులు ధృవీకరించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థిితి అదుపులోనే ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం విస్తృతంగా చుట్టుపక్కల ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Next Story

