Fri Dec 05 2025 07:12:40 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : అన్నా నన్నెందుకు చంపుతున్నారు.. వేడుకున్నా వదలని కిరాతకులు
గద్వాల్ లో జరిగిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

మేఘాలయ హనీమూన్ హత్య కేసు తరహాలోనే గద్వాల్ లో జరిగిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనను చంపొద్దని వేడుకున్నా నిర్దాక్షిణ్యంగా కిరాతకులు వేటకొడవళ్లతో తేజేశ్వర్ ను మట్టుబెట్టారు. అయితే ఈ కేసులో ఇప్పటికే తిరుమలరావు, నాగేశ్, పరశురామ్, రాజులను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు విచారణలో మరిన్ని విషయాలను కనుగొన్నారు. పోలీసులు మీడియాకు హత్యకు గల కారణాలను, హత్య చేసిన తీరును కూడా మీడియాకు వివరించారు. తేజశ్వర్ ను చంపేయాలని ఐశ్వర్య, తిరుమలరావులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఐదేళ్ల నుంచి వీరికి వివాహేతర సంబంధం ఉంది. ఐశ్వర్యను రెండో భార్యగా చేసుకోవాలని తిరుమలరావు భావించాడు.
భార్యను ఒప్పించి...
తన మొదటి భార్యను అందుకు ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే ఐశ్వర్య ఇంట్లో కూడా తిరుమలరావును చేసుకుంటే కుటుం పరువు ప్రతిష్టాలు రోడ్డుమీద పడతాయని చెప్పి ఐశ్వర్యను తేజశ్వర్ తో వివాహానికి ఒప్పించారు. అయితే బలవంతగానే, అయిష్టంగానే ఈ వివాహానికి అంగీకరించిన ఐశ్వర్య తేజశ్వర్ తో వివాహం అయిన తర్వాత కూడా సంబంధాన్ని కొనసాగిస్తుంది. రోజూ ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకునే వారు. అయితే తేజేశ్వర్ కు అనుమానం రాకుంండా తిరుమలరావు మహిళ గొంతుతో మాట్లాడేడే వాడు. ఇందుకు సంబంధించి ఒక డివైస్ ను ఉపయోగించాడు. తిరుమలరావు మాట్లాడినా మహిళ గొంతుకలా వినిపిస్తుండటంతో ఎవరికీ అనుమానం రాదని భావించారు. ఈ డివైస్ ను కూడా బ్యాంకులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చంపొద్దని వేడుకున్నా...
అయితే తేజేశ్వర్ తో తమ సంబంధం కొనసాగే అవకాశం లేదని భావించిన ఐశ్వర్య మట్టుపెట్టాలని పదే పదే తిరుమలరావుపై వత్తిడి తెచ్చింది. ఇందుకు ప్రణాళికను తిరుమలరావు తయారు చేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్ ను సంప్రదించారు. రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. అయితే గతనెల 13వ తేదీన భూమి కొలతలు తీయాలని సంగాల చెర్వువద్దకు రావాలంటూ సుపారీ గాంగ్ తేజశ్వర్ కు ఫోన్ చేయగా తన స్నేహితులతో కలసి రావడంతో అప్పటికి హత్య ప్లాన్ వాయిదా వేసుకున్నారు. మరోసారి గత నెల 17వ తేదీన డ్రైవర్ నాగేశ్, పరశురామ్, రాజు కలసి తేజేశ్వర్ ను కారులో ఎక్కించుకుని వేట కొడవళ్లు తీసి చంపపోతుండగా, తనను చంపవద్దని తేజేశ్వర్ వేడుకున్నాడు. తనను ఎందుకు చంపుతున్నారో చెప్పాలని కూడా తేజేశ్వర్ కోరారు. అయినా నిర్దయగా ఉన్న ఆ సుపారీ గ్యాంగ్ హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
Next Story

