Sat Mar 07 2026 22:27:24 GMT+0530 (India Standard Time)
ట్రక్కును ఢీ కొట్టిన స్కూల్ బస్సు.. 12 మందికి గాయాలు
హరియాణాలోని సోనిపట్ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై ..

హరియాణా : స్కూల్ బస్సు ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో 12 మంది చిన్నారులు గాయపడిన ఘటన హరియాణాలో జరిగింది. హరియాణాలోని సోనిపట్ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. రుక్మణి స్కూల్ కు చెందిన బస్సు 30 మంది విద్యార్థులతో స్కూల్ గేటులోకి ఎంటరయ్యేందుకు రాంగ్ రూట్లో వచ్చింది. అదేరూటులో ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టడంతో.. డ్రైవర్ సహా 12 మంది చిన్నారులు గాయపడ్డారు.
అయితే.. రాంగ్ రూటులో వెళ్తే త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో డ్రైవర్ అలా వచ్చాడని, అదే ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Next Story

