Thu Sep 19 2024 01:20:03 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు
ఒంగోలులోని మంగమూరు సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఆర్యవైశ్యులు చాలాకాలంగా..
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మరోమారు వార్తల్లో నిలిచారు. ఒంగోలు పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత.. తనను సుబ్బారావు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్బారావు పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.
అసలేమైందంటే.. ఒంగోలులోని మంగమూరు సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఆర్యవైశ్యులు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో విగ్రహ ఏర్పాటుకై అనుమతి కోరేందుకు పలువురు వైశ్యులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్ వద్దకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మేయర్ గంగాడ సుజాతను కులంపేరుతో దూషించారు. దాంతో మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుబ్బారావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
News Summary - SC, ST Atrocity Case Registered Against Ongole YSRCP Leader Subbarao gupta
Next Story