Tue Sep 10 2024 10:12:50 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ కు భార్యను కట్టి ఈడ్చుకెళ్లిన శాడిస్ట్ భర్త
భార్యను బైక్ కు కట్టి ఈడ్డుకెళ్లిన పైశాచిక ఘటన రాజస్థాన్ లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
భార్యను బైక్ కు కట్టి ఈడ్డుకెళ్లిన పైశాచిక ఘటన రాజస్థాన్ లో జరిగింది. తన బైకుకు కట్టేసిన భర్త భార్యను ఈడ్చుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం మత్తులో తన భార్యను కొట్టి గ్రామంలో ఈడ్చుకెళుతుంటే అందరూ చోద్యం చూసినట్లు చూశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాకు చెందిన ప్రేమ్రామ్ మేఘ్వాల్ భార్య తన సోదరి ఇంటికి వెళ్లాలనుకుం ది.
మద్యం తాగి వచ్చి...
అయితే భర్త దీనికి ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను జైసల్మేర్ లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళతానన్న భార్య కాళ్లను తాళ్లతో కట్టేసి తన బైక్ కు కట్టేశాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో జరిగినట్లు చెబుతున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు భర్త ప్రేమ్రామ్ పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు.
Next Story