Sun Mar 15 2026 09:17:49 GMT+0530 (India Standard Time)
అదృశ్యమైన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అదృశ్యమయ్యాడు. ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అదృశ్యమయ్యాడు. ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. శ్రీధరరావు గత నాలుగు రోజుల నుంచి కన్పించడం లేదు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. శ్రీధర్ రావుపై అనేక కేసులు నమోదమయ్యాయి. ఒక కేసులో అరెస్టయిన తర్వాత శ్రీధర్ రావు బెయిల్ మీద బయటకు వచ్చి కన్పించకుండా పోయాడు.
పోలీసుల విచారణకు....
శ్రీధర్ రావుపై నమోదయిన కేసుల గురించి పోలీసులు విచారించే ప్రయత్నం చేశారు. బెయిల్ ఇస్తూ హైకోర్టు షరతులు విధించింది. పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. అయితే రెండు కేసుల్లో విచారణ చేయాలని పోలీసులు భావించినా శ్రీధర్ రావు మాత్రం కన్పించడం లేదు. ఆయన ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. విచారణకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
Next Story

