Wed Dec 17 2025 06:45:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేత రాసలీలల వీడియోలు వైరల్
విద్యార్థి విభాగం అధ్యక్షుడి రాసలీలల ఫోటోలు

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ నేత, విద్యార్థి విభాగం అధ్యక్షుడి రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయచూరులోని దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అమాయక యువతులను వలలో వేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. యువతులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడంతో కర్ణాటకలో రాజకీయంగా సంచలనం రేపుతోంది.
శుక్రవారం దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విడివిడిగా అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడం సంచలనం కలిగించింది. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
Next Story

