Tue Apr 07 2026 09:06:42 GMT+0530 (India Standard Time)
పారిపోతూ.. పారిపోతూ.. బావిలో పడ్డ దొంగ
దొంగతనానికి వచ్చిన దొంగకు ఊహించని ఘటన ఎదురైంది. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డ

దొంగతనానికి వచ్చిన దొంగ జీవితం విషాదాంతమైంది. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు తమ పనిలో ఉండగా.. ఎవరో లేచిన శబ్దం, నడుస్తున్న అలికిడి వినిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి.. పారిపోవాలని ప్రయత్నించారు. ముందు వెనుకా చూసుకోకుండా పరిగెత్తారు. అందులో ఒకడు దురదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న చేదబావిలో పడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు అలికిడి వినిపించగానే పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరిలో ఒకడు అదుపు తప్పి ఇంట్లో ఉన్న బావిలో పడిపోడి చనిపోయాడు. ఈ విషయాన్ని యజమానులు పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో గురువారం ఉదయం దొంగలు పడ్డారు. గమనించిన స్థానికులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిచగా.. ఒక దొంగ దొరికాడు. మరొకడు పారిపోయాడనుకున్నారు. దొరికిన వాన్ని పట్టుకొని విచారించగా.. దొంగతనానికి వచ్చానని చెప్పుకొచ్చాడు. తాగి ఉన్న ఆ దొంగను స్థానికులు వదిలేశారు. అయితే దొంగతనం జరిగిన ఇంటికి సంబంధించిన బావిలో ఓ మృతదేహం కనిపించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. దొంగకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story

