Mon Sep 09 2024 12:01:56 GMT+0000 (Coordinated Universal Time)
పాలతయారీ కేంద్రంపై దాడులు.. 120 లీటర్ల కల్తీపాలు స్వాధీనం
తాజాగా రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీకేంద్రం గుట్టు రట్టయింది. జిల్లాలోని యాచారం మండలం నకర్తమేడిపల్లి గ్రామంలో..
యాచారం : నిత్యం మనం తీసుకునే ఆహారం కల్తీ అవుతూనే ఉంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కరువవుతోంది. ఎందులో ఏం ఉంటుందో తెలియకుండానే.. నోటికి రుచిగా ఉంది కదా తినేస్తున్నాం..తాగేస్తున్నాం. దాని పర్యయసానం తర్వాత అనుభవిస్తున్నాం. కంటికి కనిపించని కల్తీ ఆహారాన్ని గుర్తించలేకపోతున్నాం. తాగే నీటి నుంచి.. పాలు, గుడ్డు, అన్నం(ప్లాస్టిక్ రైస్),పప్పు కూడా కల్తీ అవుతున్నాయి.
తాజాగా రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీకేంద్రం గుట్టు రట్టయింది. జిల్లాలోని యాచారం మండలం నకర్తమేడిపల్లి గ్రామంలో కల్తీపాల తయారీ కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 120 లీటర్ల కల్తీ పాలు, 9 గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్లు, 1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్, 2 కిలోల వర్ణా ను స్వాధీనం చేసుకుని, దేంది జంగారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story