Thu Sep 19 2024 01:08:35 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారయత్నం
ఆర్టీసీ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దాదాపు రెండు గంటల పాటు డ్రైవర్ ఆమెను..
విజయవాడ : అక్కడ.. ఇక్కడ అన్న తేడా లేకుండా.. సమాజంలో నలుగురితో పాటే తిరుగుతూ, ఒంటరిగా కనిపించిన ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కామాంధులు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతమందికి శిక్షలు వేసినా.. ఎందరిని ఉరి తీసినా కామాంధుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడంలేదు. ఆర్టీసీ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దాదాపు రెండు గంటల పాటు డ్రైవర్ ఆమెను హింసించినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఈ దారుణ ఘటనను ఆర్టీసీ అధికారులు గోప్యంగా ఉంచారు.
Also Read : అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం అర్థరాత్రి మహిళ ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడకు వస్తోంది. ఆమెపై డ్రైవర్ కన్నుపడింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ డ్రైవర్.. సమయంచూసి మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో..దారుణంగా హింసించాడు. రెండుగంటల పాటు తన వికృత చేష్టలతో పశువులా ప్రవర్తించాడు. ఆఖరికి తోటి ప్రయాణికుడి సహాయంతో భర్తకు ఫోన్ చేయగా.. అతను అప్రమత్తమై తాను పనిచేసే సంస్థకు సమాచారం అందించాడు. కారులో తన సిబ్బందితో బస్టాండుకు వచ్చి భార్యను కామాంధుడి చెర నుంచి రక్షించి, డ్రైవర్ ను ఆర్టీసీ అధికారులకు అప్పగించారు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారా? ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ సదరు డ్రైవర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంది ? అన్న విషయాలు తెలియరాలేదు.
Next Story