Sat Mar 07 2026 17:29:11 GMT+0530 (India Standard Time)
Accident : హోటల్ లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి మృతి
జనగామలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. టిఫిన్ సెంటర్ లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారు

జనగామలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక టిఫిన్ సెంటర్ లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించినట్లు తెలిసింది. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయని చెబుతున్నారు. ఉదయం కావడంతో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో ఎక్కువ మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గాయపడిన వారిని...
ప్రమాదం జరిగిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

