Fri Dec 05 2025 10:50:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కారులోని 4.5 కోట్లు మాయం
ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపారికి చెందిన 4.5 కోట్ల రూపాయలను చోరీకి గురయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపారికి చెందిన 4.5 కోట్ల రూపాయలను చోరీకి గురయ్యాయి. నెల్లూరు సరిహద్దుల్లోని విజయవాడ జాతీయ రహదారి పై ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన వ్యాపారి ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో పంపించారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరితో పాటు డ్రైవర్ ను ఇచ్చి 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి పంపారు. అయితే నెల్లూరు సరిహద్దుల్లకి వచ్చిన వెంటనే వ్యాపారికి జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయింది.
ఢిల్లీ నుంచి...
గుమాస్తా తో పాటు డ్రైవర్ కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఏదో జరిగి ఉంటుందని గుర్తించిన వ్యాపారి వెంటనే నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మర్రిపాడు పోలీసులు హైవైపై ఉన్న కారును గుర్తించారు. కారులో ఉను్న లాకర్లు తెరచి ఉన్నట్లు కూడా చూసిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఎవరు ఈ నగదును చోరీ చేశారన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Next Story

