Thu Sep 19 2024 00:37:29 GMT+0000 (Coordinated Universal Time)
రూ.10 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం
రావులపాడు గ్రామంలో నేషనల్ హైవేకి దగ్గర్లో ఉన్న నాయుడు లేఔట్ లో గల గోడౌన్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గోడౌన్ లో..
రావులపాలెం : 10 లక్షల రూపాయల విలువైన గోవా మద్యాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం కలిసి రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో నేషనల్ హైవేకి దగ్గర్లో ఉన్న నాయుడు లేఔట్ లో గల గోడౌన్ పై దాడులు నిర్వహించారు.
Also Read : పడవ బోల్తా.. 14 మంది గల్లంతు
ఈ దాడుల్లో గోడౌన్ లో నిల్వ ఉంచిన 9200 గోవా క్వార్టర్ విస్కీ బాటిల్స్ లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గోవా నుంచి మద్యం తెప్పించి, నిల్వ ఉంచిన ప్రధాన ముద్దాయి కూసుమంచి వెంకటరత్న త్రినాథ్ తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ కేసులో మరికొంతమంది ముద్దాయిలను గుర్తించి అరెస్ట్ చేయాల్సి ఉందని, విచారణలో అన్ని విషయాలు రాబడతామని తెలిపారు.
News Summary - RS. 10 Lakhs worth Goa Alchohol Seized by Police in East Godavari District Ravulapalem
Next Story